‘భరత్ అనే నేను’ విడుదల తేదీని కూడా నిర్ణయించేశారా ?
Published on May 22, 2017 12:18 pm IST


‘శ్రీమంతుడు’ సినిమాతో సరికొత్త ఇండస్ట్రీ రికార్డుల్ని సృష్టించిన మహేష్ బాబు, కొరటాల శివలు మరోసారి కలిసి పనిచేయనున్నారు. వీరిద్దరి కలయికలో ప్లాన్ చేసిన ‘భరత్ అనే నేను’ చిత్రం ఈరోజు నుండి చెన్నైలో మొదలవుతోంది. అయితే ఈ షూటింగ్లో మహేష్ పాల్గొనడంలేదు. మురుగదాస్ తో చేస్తున్న ‘స్పైడర్’ పూర్తైన తర్వాత జూన్లో మహేష్ షూటింగ్లో జాయిన్ అవుతారు.

అప్పటి వరకు కొరటాల ఇతర కీలక నటీనటులపై సన్నివేశాల చిత్రీకరణ చేయనున్నారు. ఇకపోతే ఈ
ఈ సినిమాని 2018 జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి . అయితే ఈ అంశంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఇకపోతే డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చేస్తున్నారు.

 
Like us on Facebook