హాలీవుడ్ అవైటెడ్ చిత్రం ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’. హోమ్ మార్కెట్ సహా ఓవర్సీస్ మార్కెట్ లలో కూడా సంచలన ఓపెనింగ్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా మొదటి వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన ఈ చిత్రం ఇక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టి నిలకడగా నిలిచింది.
అయితే ఈ చిత్రం ఇండియన్ మార్కెట్ లో కూడా రికార్డు మార్క్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి వారాంతానికే 300 కోట్ల గ్రాస్ కి పైగా రాబట్టేసిన ఈ సినిమా డెఫినెట్ గా 400 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరుతుంది అని అంతా భావించారు. ఇప్పుడు అనుకున్నట్టు గానే స్పైడర్ మ్యాన్ ఈ రికార్డు మార్క్ కూడా అందుకొని ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచాడు.
దీనికి సంబంధించిన బ్యానర్ ఇపుడు బుక్ మై షోలో పొందుపరచబడింది. సో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే 400 కోట్ల మార్క్ అనేది నిజమే. ఇక మొత్తంగా ఈ చిత్రం ఆల్ టైం రికార్డు కొడుతుందో లేదో చూడాల్సిందే. టామ్ హోలాండ్, జెండాయ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని డెస్టిన్ దర్శకత్వం వహించారు.


