నెల్లూరులో రికార్డ్ స్థాయిలో రిలీజ్ కానున్న ‘స్పైడర్’ !
Published on Sep 21, 2017 1:44 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ చిత్రం ఈ అంబేళా 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ఏరియాలోని డిస్ట్రిబ్యూటర్లు విడుదలకు అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఇక నెల్లూరులో అయితే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సినిమా రికార్డ్ స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత జి. హరి సినిమా యోక్క నెల్లూరు ఏరియా హక్కుల్ని ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు.

ఈయన చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో, ఇంతకూ ముందెన్నడూ మహేష్ సినిమా రిలీజ్ కానన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్బంగా జి.హరి మాట్లాడుతూ ఈ సినిమాను నెల్లూరులో హరి పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని, భారీ ఎత్తున విడుదల చేస్తున్నామని, ఈ అవకాశం ఇచ్చినందుకు మహేష్ బాబు, మురుగదాస్, నిర్మాత ఎన్వీ ప్రసాద్ గార్లకు కృతజ్ఞతలని అన్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపోందిన ఈ సినిమాతో మహేష్ తమిళంలో అఫీషియల్ గా లాంచ్ అవుతుండటం విశేషం.

 
Like us on Facebook