Sreeleela on AI: ఏఐ డేంజర్.. ఆవేదన వ్యక్తం చేస్తున్న శ్రీలీల

Sreeleela on AI: ఏఐ డేంజర్.. ఆవేదన వ్యక్తం చేస్తున్న శ్రీలీల

Published on Dec 17, 2025 3:35 PM IST

Sreeleela 1

ప్రస్తుతం కాలంలో ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ – కృత్రిమ మేధస్సు) తాలూకా వినియోగం ఏ రేంజ్ లో పెరిగిపోయిందో చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న వాటిగా మొదలై ఇపుడు సోషల్ మీడియాలో ఏది నిజం ఏది అబద్దమో తెలియని విధంగా పరిస్థితులు మారిపోయాయి. అయితే దీని వల్ల ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎంత ఉపయోగం ఉంటుందో కానీ డ్యామేజ్ మాత్రం చాలా ఎక్కువే ప్రస్తుతం జరుగుతుంది అని చెప్పాలి.

మెయిన్ గా సినీ రంగానికి చెందిన హీరోయిన్స్ లాంటి వారు చాలామంది బాధితులుగా మారుతున్నారు. పాన్ ఇండియా మార్కెట్ లో ఉన్న దాదాపు స్టార్ హీరోయిన్స్ అంతా ఈ ఏఐ మూలాన ఇబ్బంది పడిన వారే. తాజాగా యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా ఈ వలలో చిక్కుకుంది.

ఏం జరిగింది?

ఇటీవల సోషల్ మీడియాలో ఆమెపై కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే అవి చాలా మంది ముందు నిజమే అనుకున్నారు కానీ తర్వాత అవి ఫేక్ అని తెలిసాక తేరుకున్నారు. ఇప్పుడు ఇదే విషయం శ్రీలీల దగ్గరకి వెళ్ళాక ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది.

AI చెత్తని ప్రచారం చేయొద్దు అంటూ శ్రీలీల రిక్వెస్ట్

రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను సోషల్ మీడియా వాడుతున్నవారు ఏఐ జెనరేట్ చేసిన నాన్సెస్ ని సర్క్యులేట్ చేయొద్దు అని ఆమె చెబుతుంది. ఒక రక్షణతో కూడిన వాతావరణం ఉందనే ఏ ఆడపిల్ల అయినా సినీ ఇండస్ట్రీలోకి వస్తుంది అని కానీ నా బిజీ షెడ్యూల్స్ మూలాన తన విషయంలో జరుగుతున్న ప్రచారం లేట్ గా తెలుసుకున్నాను అని నేను ప్రతీ చిన్న అంశంలో జాగ్రత్తగా ఉంటాను కానీ ఇప్పుడు జరిగింది మాత్రం పూర్తిగా జీర్ణించుకోలేని పని అని దయచేసి ఇలాంటివి ఎవరు ఎంకరేజ్ చేయొద్దని తనకి అండగా నిలబడమని ఆమె చెబుతుంది. దీనితో శ్రీలీల ప్రెస్ నోట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

శ్రీలీల కంటే ముందు బాధించబడ్డ స్టార్ హీరోయిన్స్

శ్రీలీల కంటే ముందే చాలామంది స్టార్ హీరోయిన్స్ ఏఐ ఫోటోలు మూలాన బాధించబడ్డారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మరో స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అలాగే మొన్ననే ప్రియాంక అరుళ్ మోహన్ లు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

Sreelela 2

తాజా వార్తలు