‘ఆగడు’ విడుదలకు ముందు శ్రీను వైట్ల పట్టుకున్నదంతా బంగారంగా మారింది. రామ్ చరణ్ సైతం శ్రీను చెప్పిన స్క్రిప్ట్ కూడా వినకుండా ఈ హిట్ దర్శకుడితో పనిచేయడానికి ఉత్సాహం చూపాడు. వీరిద్దరు కలసి ఒక సినిమా చేయబోతున్నారని ఒక ప్రకటన కూడా విడుదల అయ్యింది. అయితే ‘ఆగడు’ నిరుత్సాహపరిచాక రామ్ చరణ్ వెనుకంజ వేసి ఈ చిత్రాన్ని పక్కన పెట్టారు. గతంలో కోన వెంకట్ గోపి మోహన్ లతో కలసి పనిచేసిన శ్రీను ‘ఆగడు’ చిత్రానికి వాళ్ళతో పనిచేయకపోవడం కలసి రాలేదు.
గతం లో ‘ఊసరవెల్లి’ ‘రేసుగుర్రం’ ‘ఎవడు’ చిత్రాలకి స్క్రీన్ ప్లే అందించిన వక్కంతం వంశీ ని శ్రీను వైట్ల కలిసారు. వీరిద్దరు చరణ్ చిత్రానికి కలసి పనిచేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం శ్రీను వైట్ల విజయం సాధించడానికి చాలా కష్టపడుతున్నారనే చెప్పాలి.


