
‘అష్టా చమ్మా’ సినిమాతో నటుడిగా పరిచయమై పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసిన నటుడు శ్రీనివాస్ అవసరాల. నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టిన శ్రీని అవసరాల ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా శ్రీని అవసరాలకి దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీనివాస అవసరాల దర్శకుడిగా తన సెకండ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. ఈ సినిమాని కూడా వారాహి చలన చిత్రం వారే నిర్మించనుండడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ చిత్రం కోసం నూతన నటీనటుల్ని కూడా సెలెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా కూడా ఊహలు గుసగుసలాడే లాగా క్లీన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం.

