నూతన నటీనటులతో కొత్త చిత్రం ప్రారంభం…!

Published on Nov 11, 2019 11:07 am IST

గౌతమ్ వ్యాస్ ,మిస్ తెలంగాణ దీపికా వధాని లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ శ్రీ శివాయ్ ఫిలింస్ బ్యానర్ పై దర్శకుడు స్రవంతి మురళీ మోహన్ తెరకెక్కిస్తున్న ప్రొడక్షన్ నెం 1 చిత్రం హైద్రాబాద్ వేదికగా నేడు ప్రారంభమైంది . కె. రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీమంతుడు ,ఖైదీ చిత్రాల ఫేం హరీష్ ఉత్తమన్ కీలక పాత్ర పోషిస్తుండగా, అర్ధనారీ చిత్రం హీరో అర్జున్ విలన్ గా నటిస్తున్నారు .

చిత్ర దర్శకుడు స్రవంతి మురళీ మోహన్ మాట్లాడుతూ..,గౌతమ్ వ్యాస్, మిస్ తెలంగాణ దీపికా వధాని లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్న ఈ చిత్రాన్ని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ జోనర్ లో రూపొందిస్తున్నామని తెలిపారు. సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైద్రాబాద్ లో, సెకండ్ షెడ్యూల్ గోవాలో, థర్డ్ షెడ్యూల్ కేరళలో చేయనున్నట్లు తెలిపారు. నలభై రోజుల్లో సినిమా పూర్తి చేస్తామని అన్నారు. కాగా ఈ చిత్రానికి శివ నందిగామ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More