తమిళ సినిమాతోనే ఖుషి కపూర్ ఎంట్రీ ?

Published on Jul 25, 2021 9:53 pm IST

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా బాలీవుడ్ లో తన కెరీర్ ను కొనసాగిస్తోంది. అయితే, శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిందని తెలుస్తోంది. తన అక్క జాన్వీ బాటలోనే తానూ నటిగా అరంగేట్రం చేయడానికి ఇప్పటికే అమెరికాలోని న్యూయార్క్ లోని ఫేమస్ లీ స్ట్రాస్ బెర్గ్ ఇన్స్టిట్యూట్ లో నటన నేర్చుకుని వచ్చింది ఖుషి కపూర్.

అయితే, ఖుషి కపూర్ సౌత్ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకుంటోంది. ఇప్పటికే బోనీ కపూర్ ఒక తమిళ కథను కూడా రెడీ చేశాడని, పైగా ఈ సినిమాని తానే నిర్మించే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోగా విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించే అవకాశం ఉందట. మొత్తానికి 2022లో ఖుషీ కపూర్ యాక్టింగ్ డెబ్యూ ఉంటుంది అన్నమాట.

సంబంధిత సమాచారం :