దుమ్మురేపుతున్న శ్రీకాంత్, అభయ్ ల “మార్షల్” టీజర్

Published on May 22, 2019 8:37 am IST

అభయ్ హీరోగా పరిచయమవుతొన్న చిత్రం “మార్షల్”.ఏ వి ఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయనే స్వయంగా నిర్మిస్తన్నాడు. సీనియర్ హీరో శ్రీకాంత్ విభిన్నమైన షేడ్స్ ఉన్న ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఈ నెల 5న విడుదలైన మూవీ టీజర్ యూట్యూబ్ 20లక్షల వ్యూస్ తో చిన్న సినిమాల రేంజ్ కి మించి వ్యూస్ సాధిస్తోంది.
టీజర్ చూస్తుంటే మెడికల్ మాఫియా నేపథ్యంలో వస్తున్న ఓ విభిన్నమైన చిత్రంలా ఉంది.
టీజర్ ‘ఈ భూమ్మీద పుట్టి చనిపోయే ప్రతి మనిషి మొట్టమొదటిగా చిట్టచివరిగా చూసేది డాక్టర్‌నే. హ్యూమన్ బాడీని సృష్టించేది ఆ దేవుడే అయినా అప్పగించేది మాత్రం డాక్టర్లకే’ అనే వాయిస్ ఓవర్‌తో మొదలైంది.సొసైటీ లో వైద్యుని విశిష్ట తెలుపుతూనే వారుచేస్తున్న దురాగతాలను ప్రధానాంశంగా మూవీ రూపొందించినట్లున్నారు. మెడికల్ మాఫియా డాన్ గా ఎదిగిన ఓ ఇంటెలిజెంట్ డాక్టర్ గా శ్రీకాంత్ పాత్ర ఉంటుందనిపిస్తుంది

జై రాజ సింగ్ దర్శకత్వంలో మేఘా చౌదరి,రష్మి సమాంగ్ హీరోయిన్స్ గా చేస్తుండగా, సుమన్, వినోద్ కుమార్,శరణ్య, పృద్విరాజ్,రవి ప్రకాష్, ప్రియ దర్శిని రామ్, ప్రగతి,కల్ప వల్లి,సుదర్శన్, తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్, మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల ,ఫైట్స్ : నాభ మరియు సుబ్బు ఎడిటర్ : చోట కె ప్రసాద్,పిఆర్వో : శ్రీ పాటలు : యాదగిరి వరికుప్పల, నిర్మాత : అభయ్ అడకా దర్శకత్వం జై రాజ్ సింగ్

వీడియో కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More