శ్రీకాంత్ అడ్డాల సినిమా అప్డేట్ ఏంటి ?

Published on May 26, 2019 3:18 pm IST

‘కొత్త బంగారు లోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సూపర్ హిట్ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ‘బ్రహ్మోత్సవం’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమాకు సన్నద్ధమయ్యారు. సినిమా పనులు మొదలై చాలా రోజులే ఇంకా ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అందుకు కారణం కథకు సానబెట్టడమేనట. ఇన్నాళ్లు కథకు మెరుగులు దిద్దుతూ వచ్చిన అడ్డాల స్క్రిప్ట్ ఒక కొలిక్కి రావడంతో సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారట.

గతంలో లొకేషన్లోనే సీన్లు రాసుకునే ఆయన ఇప్పుడు మాత్రం బౌండ్ స్క్రిప్ట్ పెట్టుకుని పనిలోకి దిగుతున్నారు. ఈసారి ఫ్యామిలీ డోస్ కొంచెం తగ్గించి ప్రధాన పాత్రల మీదే సినిమాను నడపాలని డిసైడయ్యారట. అయితే ఇందులో హీరో ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. గీతా ఆర్ట్స్ వద్ద నాని డేట్స్ ఉండటంతో ఆయనే హీరో కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More