మరో సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్న అడ్డాల.?

Published on Jul 20, 2021 8:00 am IST

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా “నారప్ప” ను ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఫ్యామిలి ఎంటెర్టైనెర్స్ తీసే అడ్డాలలో ఇలాంటి కార్నర్ కూడా ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు. మరి ఈ సినిమా అనంతరం కూడా అడ్డాల మరో సాలిడ్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

అలాగే అది ఒక పీరియాడిక్ డ్రామా అన్నట్టుగా వినికిడి. అలాగే ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ను మన టాలీవుడ్ లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ లెవెల్లో నిర్మాణం వహించనున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే నారప్ప చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే కలైపులి తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :