తరుణ్ టీంపై విజయం సాధించిన శ్రీకాంత్ టీం

తరుణ్ టీంపై విజయం సాధించిన శ్రీకాంత్ టీం

Published on Dec 14, 2014 4:46 PM IST

srikanth-team

రాష్టంలో ఎలాంటి విపత్తు సంభవించినా వారిని ఆదుకోవడంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవలే హుదూద్ తుఫాన్ వల్ల ఉత్తరాంధ్ర మొత్తం దెబ్బతింది. మొదటగా వారిని ఆడుకోవడం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ మేము సైతం అనే వేడుకని నిర్వహించింది. అంతే కాకుండా యంగ్ హీరోస్ అంతా కలిసి ఈ రోజు విజయవాడలో క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ మాత్చ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా ఏపి సిఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు.

ఈ క్రికెట్ మ్యాచ్ శ్రీ కాంత్ – తరుణ్ జట్టుల మధ్య జరిగింది. పోటా పోటీగా జరిగిన ఈ 20-20 మ్యాచ్ లో శ్రీకాంత్ టీం ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీ కాంత్ టీం మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన తరుణ టీం మొదటి నుంచి టార్గెట్ చేదించాలనే ఉద్దేశంతో దూకుడుగా ఆడుతూ వికెట్లను కూడా కోల్పోయింది. ఫైనల్ గా కూడా 160 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో ఈ క్రికెట్ మ్యాచ్ కప్పుని శ్రీకాంత్ టీంకి అందించారు.

ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన 20 లక్షల రూపాయల్ని శ్రీకాంత్, తరుణ్, జగపతిబాబు కలిసి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావుకి అందించారు.

తాజా వార్తలు