“ముగ్గురు మొనగాళ్ల” రిలీజ్ డేట్ ఫిక్స్..!

Published on Jul 25, 2021 3:04 am IST


గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా వంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన సీనియర్ కమెడీయన్ శ్రీనివాస్‌ రెడ్డి మరోసారి “ముగ్గురు మొనగాళ్లు” సినిమా ద్వారా హీరోగా అలరించనున్నారు. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో, స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి మెయిన్ లీడ్‌ రోల్‌ చేస్తుండగా, దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు కీలక పాత్రలు పోశిస్తున్నారు.

అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఆగస్టు 6వ తేదిన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఈ సినిమాకు సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :