తన టీంకి థాంక్స్ చెప్పిన శ్రీను వైట్ల

Published on Jun 18, 2014 1:00 pm IST

srinu-vaitla

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమా హూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. లడఖ్, ముంబాయి షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ఇటీవలే హైదరాబాద్ కి తిరిగి వచ్చారు.

వరుసగా షెడ్యూల్స్ లో కూడా తన వెంటే ఉండి ఎంతో కష్టపడిన టీంకి శ్రీను వైట్ల థాంక్స్ చెప్పాడు. ‘ముంబాయి షెడ్యూల్ పూర్తయ్యింది. వరుసగా లడఖ్, ముంబై భారీ షెడ్యూల్స్ ని పూర్తి చేసాం. ఇందులో నాకు సపోర్ట్ గా ఉన్న నా టెక్నికల్ టీంకి థాంక్స్’ అని శ్రీను వైట్ల ట్విట్టర్లో పోస్ట్ చేసాడు.

ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాకి సంబందించిన శాటిలైట్ రైట్స్, నైజాం రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయాయి. మహేష్ బాబు, తమన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :