అల్లువారి అబ్బాయి ఘనత మామూలుగా లేదుగా !
Published on Sep 24, 2016 2:07 pm IST

ss
ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో మంచి విజయం సాధించిన వాటిలో అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ ఒకటి. దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా హిట్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శిరీష్ కు మర్చిపోలేని విజయాన్నందించింది. గత నెల ఆగష్టు 5న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ 50రోజులకు గాను వసూళ్ల వివరాలకు చూస్తే..

ఏరియా కలెక్షన్స్
నైజాం రూ. 2.64 కోట్లు
సీడెడ్ రూ. 1.35 కోట్లు
కృష్ణాలో రూ. 81 లక్షలు
గుంటూరు  రూ. 83 లక్షలు
వెస్ట్ రూ. 70  లక్షలు
ఈస్ట్ రూ. 77 లక్షలు
వైజాగ్ రూ. 1. 65 కోట్లు
నెల్లూరు  రూ. 31 లక్షలు
కర్ణాటక రూ. 51 లక్షలు
ఓవర్సీస్,
రెస్ట్ ఆఫ్ ఇండియా
రూ. 45 లక్షలు
టోటల్ 10,02,00,000 share

దీంతో మొత్తం షేర్ కలిపి రూ. 10, 02,00,000 కోట్లుగా ఉండగా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ. 20.2 కోట్లుగా ఉండి శిరీష్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాదించిన చిత్రంగా నిలిచింది. ఈ ఘన విజయంతో శిరీష్ స్టార్ డమ్ కూడా బాగా పెరిగింది. కొత్త, యువ దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 
Like us on Facebook