తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాను హిందీలో షారుఖ్ ఖాన్ రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. తెలుగు నిర్మాతలను కలసి రీమేక్ రైట్స్ గురించి డిస్కస్ చేశాడని ప్రచారం జరిగింది. తన తాజా హిందీ సినిమా ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఘనవిజయం సాధించిన సందర్భంగా ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అత్తారింటికి దారేది’ రీమేక్ చేయడం లేదని స్పష్టం చేశాడు.
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమాలను హిందీలో రీమేక్ చేయడం ఇటివల కాలంలో ఓ ట్రెండ్ గా మారింది. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వంటి హీరోలు సౌత్ రీమేక్ లతో సూపర్ సక్సెస్ లు అందుకున్నారు. ఒక్క షారుఖ్ మాత్రమే రీమేక్ సినిమాలకు కొంచం దూరంగా ఉన్నాడు. విమర్శకుల సమీక్షలతో సంబంధం లేకుండా ‘హ్యాపీ న్యూ ఇయర్’ రికార్డుల మోత మొగిస్తుండడంతో కింగ్ ఖాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


