ఆ ఐడియా కార్తికేయ ది – రాజమౌళి

Published on Aug 2, 2021 3:42 pm IST


స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ దోస్తీ మ్యూజిక్ వీడియో ని ఐదు భాషల్లో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఆధ్వర్యం లో అనిరుద్ రవి చందర్, అమిత్ త్రివేది, విజయ్ ఏసుదాస్, యాజీన్ నీజర్, హేమ చంద్ర లు ఇందుకోసం కలిసి పని చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పాట లో వీరితో పాటుగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లని కూడా చూపించడం జరిగింది. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈ పాట ఇండియా లో నే భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

అయితే ఈ దోస్తీ మ్యూజిక్ వీడియో పై రాజమౌళి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఐడియా ఎస్ ఎస్ కార్తికేయ ది అంటూ చెప్పుకొచ్చారు. సతీశ్ కృష్ణన్ మరియు కార్తికేయ లు కలిసి ఈపాట కోసం పనిచేసినట్లు తెలిపారు. దినేష్ కృష్ణన్ ఈ పాట కి సినిమాటోగ్రఫి అందించినట్లు తెలిపారు. అయితే ఈ పాట కు వస్తున్న స్పందన తో ఎంతో సంతోషం గా ఉందని పేర్కొన్నారు. అయితే ఈ పాట కి మొత్తం క్రెడిట్స్ ఎం ఎం కీరవాణి కి మరియు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఇచ్చారు. అంతేకాక ఈ లిరిక్స్ ను వివిధ బాషల్లో అనివదించిన రచయిత లకి థాంక్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం :