ఎన్టీఆర్ కి – చరణ్ కి నేను సమ న్యాయం చేశా – రాజమౌళి

rajamouli

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనమైన వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేసింది. అయితే, ఆర్ఆర్ఆర్ లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ లలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారనే అంశంపై డైరెక్టర్ రాజమౌళి తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా ఓ షోలో యాంకర్ సుమ రాజమౌళిని ఈ ప్రశ్న అడిగింది. రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఏ ఒక్కరికో ఎక్కువో, తక్కువో న్యాయం చేస్తే సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేదికాదు. నేను సమ న్యాయం చేశా’ అని చెప్పుకొచ్చాడు. అలాగే సుమ మరో ప్రశ్న కూడా అడిగారు. విజయేంద్రప్రసాద్, కీరవాణిలను తప్పించి సినిమాలు తీసే అవకాశముందా ? అని ఆమె అడిగింది. దీనికి జక్కన్న అది అసాధ్యమని చెప్పుకొచ్చాడు.

Exit mobile version