‘రజనీకాంత్’ సినిమా చూడలేక ఫీలైన ‘రాజమౌళి’
Published on Jul 22, 2016 10:09 am IST

rajamouli-and-rajinikanth

ఈ రోజు సీనీ అభిమానులంతా ‘కబాలి’ సినిమా మొదటిరోజే చూడాలని తపనపడుతుంటారు. ఇక రజనీ అభిమానులైతే మొదటి రోజు మొదటి ఆటనే చూసెయ్యాలని ఆరాటపడుతుంటారు. అలాంటి వారిలో దర్శక ధీరుడు ‘ఎస్.ఎస్. రాజమౌళి’ కూడా ఒకరు. ఆయన తలైవార్ రజనీకి వీరాభిమాని. అయినా కూడా ‘కబాలి’ మొదటి రోజు మొదటి షో చూడలేకపోతున్నారాయన.

ఎందుకంటే ప్రస్తుతం బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఆయన సినిమా చూడలేకపోయారు. ఇదే విషయాన్ని జక్కన్న కాస్త ఫీలవుతూ ‘బాహుబలి షూటింగ్ లో ఉండటం వల్ల కబాలి మొదటి షో చూడలేకపోతున్నాను. థియేటర్లలో ఉండి ఉంటే నేను కూడా తలైవా మేనియాలో మునిగేవాడిని’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న బాహుబలి – 2 చిత్రాన్ని 2017 ఏప్రిల్ కి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

 
Like us on Facebook