రాజమౌళి ఇంటర్నేషనల్ లెవల్ అంటే ఏంటో చూపాలనుకుంటున్నారా ?

Published on Nov 21, 2019 2:46 pm IST

‘బాహుబలి’ చిత్రంతో రాజమౌళి సెట్ చేసిన పాన్ ఇండియన్ సినిమా అనే పద్దతిని ఫాలో అవ్వాలని చాలామంది దర్శక నిర్మాతలు, స్టార్ హీరోలు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు జరగ్గా వాటిలో కొన్ని బోల్తాపడి ఇంకొన్ని కొంతవరకు మాత్రమే విజయం సాధించగలిగాయి. ఇలా అందరూ రాజమౌళి ట్రెండును ఫాలో అవుతుంటే రాజమౌళి మాత్రం పాన్ ఇండియా అయిపోయింది ఇప్పుడిక ఇంటర్మేషనల్ లెవల్ అంటూ దూసుకుపోతున్నారు.

అందుకు సాక్ష్యమే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటుల్ని ఎంచుకోవడం. సినిమాలో ప్రధానమైన విలన్ పాత్రల కోసం ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌సన్‌ను, ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. అలాగే ఎన్టీఆర్ జోడీగా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. ఈ ఎంపికను చూస్తే రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో సినిమాను రూపొందించడానికి ట్రై చేస్తున్నట్టే అనిపిస్తోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం మొత్తం 10 భాషల్లో విడుడలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More