అఫీషియల్ : SSMB 28 మాస్ స్ట్రైక్ గ్లింప్స్ టైం లాక్

Published on May 31, 2023 1:02 am IST

సూపర్ స్టార్ మహేష్ తో సూపర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న లేటెస్ట్ వర్కింగ్ టైటిల్ మూవీ SSMB 28. మొదటి నుండి అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఇటు ఆడియన్స్ లో సూపర్ గా క్రేజ్ కలిగిన ఈ మూవీ నుండి రేపు లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా టైటిల్ తో పాటు మాస్ స్ట్రైక్ పేరుతో ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ మాస్ స్ట్రైక్ ని కృష్ణ గారు నటించిన మోసగాళ్లకు మోసగాడు మూవీ రీ రిలీజ్ థియేటర్స్ లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు.

అయితే విషయం ఏమిటంటే, తాజాగా ఈ మాస్ స్ట్రైక్ గ్లింప్స్ యొక్క నిడివి 01 ని. 03 సెకండ్స్ గా ఫిక్స్ చేయబడింది. సెన్సార్ బోర్డ్ వారు జారీ చేసిన మాస్ స్ట్రైక్ గ్లింప్స్ యొక్క సర్టిఫికెట్ ని కొద్దిసేపటి క్రితం నిర్మాత నాగవంశీ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 జనవరి 13న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :