బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ కుమార్ ప్రస్తుతం స్కై ఫోర్స్, సింగం ఎగైన్ (అతిధి పాత్ర), వెల్‌కమ్ టు ది జంగిల్, సి శంకరన్ నాయర్ బయోపిక్ మరియు మరికొన్ని సినిమాలు చేస్తున్నారు. అయితే గతంలో స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ తో కలిసి హేరా ఫేరి, గరం మసాలా, భాగం బాగ్, మరియు భూల్ భులైయా, దే దనా ధన్, ఖట్టా మీటా చిత్రాలలో పనిచేశారు అక్షయ్. అవి అన్ని కూడా మంచి విజయాలు అందుకుని వీరి కాంబోకి పేరు తీసుకువచ్చాయి. కాగా మ్యాటర్ ఏమిటంటే, 14 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్‌తో మళ్లీ కలిసి పనిచేయనున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ప్రియదర్శన్ ధృవీకరించారు.
కామెడీ, హారర్, ఫాంటసీ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు ఏక్తా ఆర్ కపూర్ నిర్మించనున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం నేను రామమందిర చరిత్రపై డాక్యుమెంటరీ సిరీస్‌ను పూర్తి చేసాను, ప్రస్తుత అక్షయ్ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించాను, భారతదేశంలోని పురాతన మూఢనమ్మకాలు, బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందన్నారు. అక్షయ్‌తో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. మా మొదటి సినిమా నుండి మా మధ్య మంచి అనుబంధం ఉంది, త్వరలో మళ్ళీ సెట్స్ లో తనతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు ప్రియదర్శన్