సైరాలో షూటింగ్ లో జాయిన్ అయిన ప్రముఖ నటులు !

Published on Oct 8, 2018 10:07 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న’సై రా నర్సింహారెడ్డి’ చిత్రం యొక్క షూటింగ్ జార్జియా దేశంలో జరుగుతుందని తెలిసిందే. ఈ షెడ్యూల్లో భారీ యుద్ధసన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక తాజాగా ఈషెడ్యూల్ లో ప్రముఖ సీనియర్ నటుడు జగపతి బాబు అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి పాల్గొంటున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ల ఆధ్వర్యంలో సుమారు 500 మంది ఫై ఈ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి.

ఈచిత్రం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈచిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :