పెళ్లి చేసుకోబోతున్న ప్రియదర్శి !
Published on Feb 20, 2018 11:06 am IST

‘పెళ్ళి చూపులు’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రియదర్శి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నెల 23 న హైదరాబాద్ లో ప్రియదర్శి వివాహం జరగనుంది. రీచా అనే అమ్మాయిని ప్రేమించిన దర్శి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోబోతుండడం విశేషం.

‘పెళ్లి చూపులు’ సినిమా విజయం తరువాత ప్రియదర్శి బిజీ ఆర్టిస్ట్ గా మారాడు. పెద్ద హీరోల సినిమాల్లో మంచి పాత్రలు దక్కడంతో స్టార్ కమెడియన్ అయ్యాడు. ఇటీవల విడుదలైన ‘తొలిప్రేమ, అ !’ సినిమాల్లో ప్రియదర్శి చేసిన పాత్రకు మరింత గుర్తింపు లభించింది. 23 న జరిగే వివాహానికి కుటుంభ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. 26న హైదారాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ చెయ్యబోతున్నారు. సినీ తారలు ఈ ఫంక్షన్ కు అటెండ్ కాబోతున్నారు.

 
Like us on Facebook