స్టార్ హీరో కూతురు మల్టీ లాంగ్వేజ్ సినిమా!
Published on Oct 5, 2017 12:53 pm IST

తమిళ స్టార్ హీరో, సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈమె తాజాగా నటిస్తున్న ఓ మల్టీ లాంగ్వేజ్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. శక్తి టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని తెలుగులో హీరో రాణా తన ట్విట్టర్ పేజి ద్వారా రివీల్ చేసారు.

యాక్షన్ నేపధ్యంలో సాగే ఈ సినిమా తమిళ, మలయాళీ, తెలుగు భాషాల్లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు ప్రియదర్శిని కాగా, ప్రముఖ తమిళ హీరో ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే లుక్ ని తమిళంలో హీరో శివ కార్తికేయన్, దర్శకుడు విఘ్నేశ్ శివన్ రివీల్ చేయగా, మలయాళీ పోస్టర్ ని హీరో దుల్కర్ సల్మాన్ రివీల్ చేసారు.

 
Like us on Facebook