కోవిడ్ నుంచి కోలుకున్న స్టార్ దర్శకుడు అనీల్.!

Published on Apr 28, 2021 2:11 pm IST

మన టాలీవుడ్ లో తమ మొదటి సినిమా నుంచే హిట్ అందుకొని అదే హిట్ పరంపర కొనగిస్తూ వస్తున్న అతి కొద్ది దర్శకుల్లో స్టార్ దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఒకరు. లాస్ట్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”తో భారీ హిట్ సొంతం చేసుకున్న అనీల్ రావిపూడి ఇప్పుడు ఓ ప్రెస్ నోట్ ద్వారా తాను కరోనా నెగిటివ్ అయ్యినట్టుగా తెలిపారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే అనీల్ కు ఈ ఏప్రిల్ 13నే కరోనా పాజిటివ్ వచ్చిందట.

దానితో పర్సనల్ గా తనని కలిసిన ప్రతి ఒక్కరినీ టెస్ట్ చేయించుకొని హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లాలని కోరానని చెప్పారు. మరి అలా అక్కడ నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు తాను కోవిడ్ నెగిటివ్ అయ్యినట్టుగా అధికారికంగా తెలియజేసారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాక్సిన్ వేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాని అనీల్ తెలిపారు. ప్రస్తుతం అనీల్ విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లతో “ఎఫ్ 3” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :