చరణ్ కి కథ చెప్పనున్న స్టార్ డైరెక్టర్ ?

Published on Jul 12, 2020 12:44 am IST


‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. మొదట వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నా చివరికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారని వార్తలు వచ్చాయి. ఇక వంశీ మిగిలిన స్టార్ హీరోల చుట్టూ కథ పట్టుకుని తిరుగుతున్నాడట. ఈ క్రమంలోనే ప్రభాస్ దగ్గర నుండి రామ్ చరణ్ దాకా పేర్లు వినపడ్డాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనే ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే చరణ్ కి కథ చెప్పి ఒప్పించాలని వంశీ డిసైడ్ అయ్యాడట.

అన్నట్టు ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ తో వంశీ పైడిపల్లి సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారట. ఇక వంశీ, చరణ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి. అయితే చరణ్ తో సినిమా అంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే. ఈ లోపు వెబ్ సిరీస్ చేయాలని చూస్తున్నాడు వంశీ. పైగా వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించాయి.

సంబంధిత సమాచారం :

More