కేటుగాళ్లకి స్మూత్‌గా వార్నింగ్ ఇచ్చేసిన స్టార్ హీరో.. ఏమా కథ !

Published on Sep 18, 2020 3:00 am IST


సోషల్ మీడియా వినియోగం పెరిగాక చీటింగ్ చేసే వాళ్ల సంఖ్య బాగా పెరిగింది. జనం దృష్టిని ఆకట్టుకోవడానికి రకరకాల అబద్దాలు, కట్టు కథలు చెబుతుంటారు. ఆ మోసాల్లో ఒక్కోసారి సెలబ్రిటీల పేర్లు వాడుకునేవారు కోకొల్లలు. హీరోలు, దర్శకులు, నిర్మాణ సంస్థలు తమకు బాగా తెలుసని, అవకాశాలు ఇప్పిస్తామని ఎంతో మంది దగ్గర డబ్బులు గుంజిన సందర్భాలు అనేకం. ఇప్పటికీ కొందరు సెలబ్రిటీల పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుకుంటూ ఒక్కోసారి ఆ సెలబ్రిటీలకు చెడ్డ పేరు తెస్తుంటారు. తాజాగా అలాంటి అనుభవమే స్టార్ హీరో అజిత్ కు ఎదురైంది.

తమిళనాట అజిత్ స్టార్ డమ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. అశేషమైన అభిమానులున్నారు ఆయనకు. ఆయన పేరు ఎక్కడ వినబడినా హడావిడి ఉంటుంది. అలాంటిది అజిత్ మనుషులమని, అజిత్ యొక్క సినిమాలు, వ్యాపారాలు చూసుకునేది మేమే అంటూ ఎవరైనా ముందుకొస్తే ఆ హంగామా ఇంకా ఎక్కువ. అందుకే అజిత్ కు బాగా దగ్గరి వ్యక్తులమని, ఆయన వ్యవహారాలన్నీ చూసేది తామేనని కొందరు ప్రచారం చేసుకుంటూ అభిమానులను ఆకట్టుకుని ఏదో లాభం పొందాలనే ప్రయత్నాలు చేశారు. ఇది ఆ నోటా ఈ నోటా పడి అజిత్ వరకు వెళ్ళింది.

దీంతో అజిత్ చాలా స్మూత్‌గా రియాక్ట్ అయి తన లీగల్ బృందాన్ని రంగంలోకి దింపారు. వారు ‘కొందరు వ్యక్తులు అజిత్ తో సంబంధాలు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కానీ అజిత్ యొక్క వృత్తి, వ్యాపార పరమైన వ్యవహారాల కోసం సురేష్ చంద్ర అనే వ్యక్తిని మాత్రమే నియమించుకున్నారు. ఎలాంటి అధికారిక వ్యవహారాలైనా ఆయనే చూసుకుంటారు తప్ప వెరొకరు కాదు. కాబట్టి ఎవరైనా అజిత్ స్టాఫ్ అంటూ మీకు కనెక్ట్ అయితే వెంటనే మాకు తెలపండి, మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అంటూ లీగల్ నోటీస్ జారీ చేసి సదరు కేటుగాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇకపోతే అజిత్ హెచ్.వినోత్ డైరెక్షన్లో చేస్తున్న ‘వాలిమై’ సినిమా షూటింగ్ అక్టోబర్ నుండి రీస్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :

More