వాయిదాపడిన స్టార్ హీరో సినిమా !
Published on Oct 16, 2017 4:36 pm IST

త‌మిళ స్టార్ హీరో విజయ్ తాజాగా నటించిన త‌మిళ చిత్రం ‘మెర్సెల్‌’. సమంత, కాజల్‌, నిత్యా మీన‌న్‌ కథానాయికలు. అట్లీ దర్శకుడు. ఈ మూవీ తెలుగులో ‘అదిరింది’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మరియు పాటలు ఆకట్టుకున్నాయి. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 18 న విడుదల అవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం ‘అదిరింది’ 18 న విడుదల అవ్వడం లేదు. కొన్ని అనివార్య కారణాలవల్ల 19 న విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ఈ చితాన్ని తెలుగు లో విడుదల చేస్తున్నారు. గతంలో అట్లీ, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన తేరి సినిమా మంచి విజయం సాదించింది. మళ్ళీ వీరిద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తమిళ్ లో మాత్రం ‘మెర్సెల్‌’ యథావిధిగా 18 న విడుదల కానుంది

 
Like us on Facebook