‘ఆర్ఆర్ఆర్’కి పోటీగా స్టార్ హీరో సినిమా ?

Published on Feb 13, 2020 1:48 am IST

రాజమౌళి – ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలయికలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తూ జనవరి 8న విడుదల కానుంది. దాంతో ఇక ఈ సినిమాకి పోటీగా ఇంక ఏ సినిమాని రిలీజ్ చేయరని అనుకున్నారు అంతా. కానీ ‘ఆర్ఆర్ఆర్’కి పోటీగా స్టార్ హీరో తన సినిమాని రిలీజ్ కి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ స్టార్ హీరో తెలుగు హీరో కాదు, తమిళ్ హీరో.

తమిళ స్టార్ హీరో విజయ్ 2021 సంక్రాంతి పై దృష్టి పెట్టారట. తమిళనాడులో కూడా సినిమాలకు పెద్ద సీజన్ అయిన పొంగల్ ను మిస్ చేసుకోకూడదు అని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పొంగల్ సందర్భంగా తానూ సుధ కొంగరతో చేస్తోన్న కొత్త చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నట్టు ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ చేయబడుతుంది.

మరి ‘ఆర్ఆర్ఆర్’కి పోటీగా ఈ సినిమా ఎంత వరకూ నిలబడుతుందో చూడాలి. ఇక ‘ఆర్ఆర్ఆర్’లో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :