ఆ స్టార్ హీరోకు కూడ కరోనా సోకిందట

Published on Oct 20, 2020 7:06 pm IST

ఇప్పుడిప్పుడు సినీ ఇండస్ట్రీ కోలుకుంటోంది. 6 నెలలుగా పనులు లేక ఇబ్బందిపడిన సినీ కార్మికులు మెల్లగా షూటింగ్స్ మొదలవుతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటీనటులు కొందరు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణల్లో పాల్గొంటున్న కొందరు నటీనటులకు కరోనా సోకగా తాజాగా మాలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం కరోనాకు ఎఫెక్ట్ అయ్యారు.

అక్టోబర్ 7వ తేదీ నుండి పృథ్వీరాజ్ తన కొత్త చిత్రం ‘జన గణ మన’ షూటింగ్లో పాల్గొంటున్నారు. చిత్రీకరణ ప్రారంభించే సమయంలో అందరికీ కరోనా పరీక్షలు చేయగా అండరికీ నెగెటివ్ రావడంతో షూట్ స్టార్ట్ చేశారు. తాజాగా ఇండోర్ సైట్లో షూటింగ్ జరపాల్సి ఉండటంతో మరోసారి బృందం మొత్తానికి కొవిడ్ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో పృథ్వీరాజ్ కు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో ఆయన వెంటనే సెల్ఫ్ ఐసొలేషన్ తీసుకున్నారు.

తనకు ఎలాంటి సింప్టమ్స్ లేవని, అసింప్టమాటిక్ అని చెప్పిన పృథ్వీ ప్రజెంట్ ఆరోగ్యం బాగానే ఉందని, కంగారు పడాల్సిన పనేమీ లేదని, తనతో కాంటాక్ట్ అయిన వాళ్లను పరీక్షలు చేయించుకోమని సూచించినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఇటీవలే తమ హీరో పుట్టినరోజును ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నామని కానీ ఇంతలోనే ఆయనకు కరోనా సోకిందని అప్సెట్ అవుతూ పృథ్వీరాజ్ త్వరగా కోలుకోవాలని పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More