హాలీవుడ్ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన సౌత్ ఇండియా స్టార్ హీరో !
Published on May 17, 2017 6:21 pm IST


సౌత్ ఇండియా స్టార్ హీరోల్లో ఒకరైన ధనుష్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. రొమైన్ పుయెర్టోలా రాసిన ఒక ప్రమువైఖ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ అనే టైటిల్ ను నిర్ణయించారు. కెన్ స్కాట్ డైరెక్ట్ చేస్తునం ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ నిన్నటి నుండి ముంబైలో మొదలైంది. హీరో ధనుష్ కూడా ఆ షెడ్యూల్లో నిన్నటి నుండే పాల్గోంటున్నారు.

ఇందులో ధనుష్ అజాతశత్రు ఒఘాషు రాథోడ్ అనే పాత్ర చేస్తున్నాడు. దర్శకుడు కెన్ స్కాట్ ధనుష్ గురించి మాట్లాడుతూ ‘ధనుష్ విలక్షణమైన నటుడు. ఆయనలో మంచి సింగర్, డ్యాన్సర్ ఉన్నారు. ఆయనలో ఒక సపరేట్ స్టైల్ ఉంది. ఆయనతో పనిచేయడం చాలా బాగుంది’ అన్నారు. ముంబై షెడ్యూల్ పూర్తవగానే చిత్ర యూనిట్ మరో కొత్త షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనున్నారు.

 
Like us on Facebook