వెబ్ సిరీస్ చేయబోతున్న మరో స్టార్ హీరోయిన్ ?

Published on Jul 6, 2020 7:20 pm IST


కరోనా దెబ్బకు ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లను నిర్మించే ప్లాన్ లో పడ్డారు. ఈ నేపథ్యంలో స్టార్స్ కూడా డిజిటిల్ వైపు చూస్తున్నారు. వెబ్ సిరీస్ కథలను కూడా నటించేయడానికి సై అంటున్నారు. కాగా ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత ‘థ ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండవ సీజన్ లో నటించింది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా ఓ వెబ్ సిరీస్ చేయనుంది. ఇప్పుడు వీరి బాటలోనే త్రిష కూడా తమిళంలోని ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి ఇంట్రస్టింగ్ గా ఉందట.

ఇది తండ్రి, కూతుళ్ల మధ్య జరిగే ఎమోషనల్ సిరీస్ అని, ఎక్కువ నిడివి ఉన్న ఇలాంటి వెబ్ సిరీస్ స్టోరీస్ లో నటిస్తే తమ ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో త్రిష కృష్ణన్ ఈ వెబ్ సిరీస్ లో నటించబోతుందట. అన్నట్టు ఈ వెబ్‌ సిరీస్‌ ను దర్శకుడు రామ సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేయనుండగా, అనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తోంది. మొత్తానికి త్రిష కూడా వెబ్ చూపులు చూస్తోంది.

సంబంధిత సమాచారం :

More