‘మెగాస్టార్ 152’ నైజాం రైట్స్ ను అప్పుడే కొనేశాడట ?

‘మెగాస్టార్ 152’ నైజాం రైట్స్ ను అప్పుడే కొనేశాడట ?

Published on Jan 25, 2020 4:21 PM IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘చిరు 152వ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచరం ప్రకారం ఈ చిత్రం పూర్తి కాక ముందే నైజాం హక్కులను దిల్ రాజు భారీ ధరకు కొనుగోలు చేశాడట. ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతొంది. ఇక ఫస్ట్ షెడ్యూల్ లో కొరటాల కొన్ని ఎమోషనల్ సీన్స్ ను షూట్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ లో వచ్చే ఈ సీన్స్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయట. ఈ చిత్రం కోసం మెగాస్టార్ బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు.

కాగా ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి మూడు ట్యూన్లను సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ ఉందట, ఈ సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది. అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే మెగాస్టార్ – కొరటాల నుండి ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు