స్టార్ తనయుడి అరంగేట్ర సినిమా షూటింగ్ పూర్తి!

స్టార్ తనయుడి అరంగేట్ర సినిమా షూటింగ్ పూర్తి!

Published on May 13, 2015 8:51 PM IST

Naresh-Naveen
సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ హీరోగా పరిచయం కానున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రామ్ ప్రసాద్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మించిన ఈ సినిమాకు అచ్చు సంగీత దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ పకడ్బందీగా పూర్తి చేసి జూన్ నెలాఖరు కల్లా ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో సినిమా నిర్మాతలు ఉన్నారట.

తాజా వార్తలు