చిరు కోసం స్టార్ ఫైటర్స్ రంగంలోకి దిగుతున్నారట ?

Published on Oct 22, 2020 3:00 am IST


మెగాస్టార్ చిరంజీవి సైన్ చేసిన సినిమాల్లో తమిళ చిత్రం ‘వేదాళం’ తెలుగు రీమేక్ కూడ ఒకటి. ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్నారు. కొన్నేళ్ల పాటు ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసిన మెహర్ రమేష్ కథను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు మార్పులు చేశారు. చిరు ఈ రీమేక్ చేయడానికి ప్రధాన కారణం సినిమాలోని మాస్ కటెంట్. తన ప్రధాన బలమైన మాస్ ప్రేక్షక వర్గాలను అలరించడానికి ఇలాంటి కథ అయితేనే బాగుంటుందని చిరు భావిస్తున్నారు.

ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉండనుండటంతో స్టార్ స్టంట్ కొరియోగ్రఫర్లు రామ్ – లక్ష్మణ్ అయితే బాగుంటుందని చిరు భావిస్తున్నారని, వారినే ప్రాజెక్ట్ కోసం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. వీళ్ళే గనుక చిరు సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తే మాత్రం అభిమానులకు కనులపండుగేనని ఖచ్చితంగా చెప్పొచ్చు. మార్చి నెల నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న చిరు ‘లూసిఫర్’ రీమేక్ కూడ చేయాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More