ప్రభాస్‌ను డైరెక్ట్ చేయనున్న స్టార్ రైటర్.. నిజమేనా ?

Published on May 22, 2019 6:47 pm IST

ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న ఆసక్తికరమైన వార్తల్లో ప్రభాస్‌ను ఒక స్టార్ రైటర్ డైరెక్ట్ చేయనున్నాడు అనే వార్త అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ‘కృష్ణం వందే జగద్గురుం, మహానటి, కంచె, శాతకర్ణి, ఖైదీ నెం 150’ లాంటి సినిమాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సాయి మాధవ్ బుర్రా. ఈయన త్వరలోనే దర్శకుడిగా మారనున్నారట.

అది కూడా ప్రభాస్ హీరోగా కావడం విశేషం. సాయి మాధవ్ బుర్రా ఈమధ్యే ప్రభాస్‌కు ఒక స్టోరీ లైన్ చెప్పాడని, అది నచ్చిన ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. మరి ఈ సంచలన వార్త నిజమో కాదో తేలాలంటే విశ్వసనీయ సమాచారాన్ని రాబట్టాల్సిందే. ఇకపోతే గతంలో ప్రభాస్ రచయిత నుండి దర్శకుడిగా మారాలనుకున్న కొరటాల శివకు ‘మిర్చి’ రూపంలో తొలి అవకాశం ఇవ్వడం, అది హిట్టవడం, ఆ తర్వాత కొరటాల వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ అవడం అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More