‘సీత’ పాత్రలో ఐశ్వర్య రాయ్ ?

Published on Jul 26, 2021 10:31 pm IST

బాహుబలితో నేషనల్ రైటర్ గా పాపులారిటీ సాధించిన విజయేంద్ర ప్రసాద్ ‘సీత’ కోణంలో సాగే ఓ పౌరాణిక కథను రాశారు. ఇక ఈ కథలో ‘సీత’ పాత్రలో దర్శక, నిర్మాతలు ముందుగా కరీనా కపూర్ ను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కరీనా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు ఆమెతో ఈ సినిమాని చేయాలనే ఆలోచనను విరమించుకున్నారు.

మరోపక్క హిందీ సోషల్ మీడియాలో కరీనాకి బదులు కంగనా రనౌత్ ను ఈ పాత్ర కోసం తీసుకుంటే బాగుంటుంది అంటూ మేకర్స్ కి నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. నిజానికి కరీనాతో పోల్చుకుంటే కంగనాకి మార్కెట్ ఎక్కువ. పైగా కంగనా తలైవితో సౌత్ లో మంచి మార్కెట్ కూడా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ కంగనాతో సినిమా చేయడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ గా లేరు.

అందుకే ఇప్పుడు ఈ పాత్రలో ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ను తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఐశ్వర్య రాయ్ అయితే ఈ సినిమాకి ఫుల్ క్రేజ్ ఉంటుంది. మరి మేకర్స్ సీత పాత్రలో ఎవర్నీ తీసుంటారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :