‘తని ఒరువన్’ కోసం ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ మధ్య భారీ పోటీ

Thani-Oruvan
ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం అనేది చాలా కామన్ గా జరిగే విషయమే.. అలా తమిళంలో రీసెంట్ గా వచ్చి పెద్ద హిట్ అయిన సినిమా ‘తని ఒరువన్’. జయం రవి హీరోగా మోహన్ రాజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం తమిళ బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ లో నటించేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఆసక్తి చూపుతున్నారని ఇది వరకే తెలియజేశాం. ఇది పక్కన పెడితే ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఇద్దరు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ మధ్య భారీ ఎత్తున పోటీ నెలకొంది.

వారిద్దరే దిల్ రాజు మరియు డివివి దానయ్య – ఎన్.వి ప్రసాద్.. ఇక విషయంలోకి వెళితే.. దివివి దానయ్య – ఎన్.వి ప్రసాద్ లు కలిసి ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ట్రై చేస్తున్నారు అందులో భాగంగానే తని ఒరువన్ కథ రైట్స్ కోసం 9 కోట్లు ఆఫర్ చేసారు. వీరితో పాటు దిల్ రాజు కూడా ఈ మూవీ రైట్స్ కోసం వాళ్ళతో పోటీ పడుతున్నాడు. కానీ తమిళ కథ రచయిత, డైరెక్టర్ మోహన్ రాజ తెలుగులో కూడా తనకే డైరెక్ట్ చేసే అవకాశం ఇస్తేనే రైట్స్ అమ్మడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. దాంతో ప్రస్తుతం తెలుగు టాప్ ప్రొడ్యూసర్స్ మోహన్ రాజతో చర్చలు జరుపుతున్నారు.

ఫైనల్ గా ఈ రీమేక్ రైట్స్ డివివి దానయ్య – ఎన్.వి ప్రసాద్ లకు దక్కితే రామ్ చరణ్ హీరోగా కనిపించే అవకాశం ఉంది. అలా కాకుండా దిల్ రాజు చేతికి రీమేక్ రైట్స్ వస్తే మహేష్ బాబు హీరోగా నటించే అవకాశం ఉంది. కానీ రీమేక్ రైట్స్ ఎవరికి వెళ్తాయి మరియు ఎవరు హీరోగా చేస్తారు అనే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది కావున దాని కోసం మనం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Exit mobile version