“పుష్ప” సెకండ్ సింగిల్ పై స్ట్రాంగ్ బజ్!

Published on Aug 29, 2021 11:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుస్తుంది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఏ అప్డేట్ కూడా ఆడియెన్స్ ని డిజప్పాయింట్ చెయ్యలేదు..

మరి ఇప్పుడు ఈ చిత్రం నుంచి రానున్న సెకండ్ సింగిల్ పై గత కొన్ని రోజులు నుంచి బజ్ వినిపిస్తుండగా అది ఇప్పుడు ఇంకాస్త ఎక్కువగానే వినిపిస్తుంది. వచ్చే సెప్టెంబర్ లోనే ఈ చిత్రం రెండో సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయని అలాగే ఇది బన్నీ, రష్మికాల మధ్య డ్యూయెట్ సాంగ్ నే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే దేవీ ఇచ్చిన ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ అయ్యింది. దీనితో రెండో సాంగ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సాంగ్ నిజంగానే వచ్చే నెలలో రిలీజ్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :