రామ్ గట్టిగానే కొడుతున్నాడు

Published on Jan 15, 2021 3:00 am IST

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటించిన ‘రెడ్’ చిత్రం ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మొదటి నుండి సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ ఉండటం, టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో హైప్ పెరిగింది. ఇక రామ్ గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ భారీ హిట్ కావడం మూలాన ఆ ఎఫెక్ట్ ఈ సినిమా మీద కూడ పడింది. ‘ఇస్మార్ట్ శంకర్’లో డబుల్ దిమాక్ అంటూ ఇరగదీసిన రామ్ ‘రెడ్’లో కూడ అలాంటి ట్రీటే ఇస్తాడని నమ్మిన మాస్ ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు.

ఎక్కువ థియేటర్లలో విడుదలకావడం కూడ సినిమాకు కలిసొచ్చింది. మార్నింగ్ షో నుండి మ్యాటనీ, ఫస్ట్ షో, సెకండ్ షో వరకు కలెక్షన్లు ఎక్కడా డ్రాప్ కాలేదు. పండుగ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సైతం కరోనా భయాన్ని పక్కనపెట్టి సినిమా హాళ్ల బాట పట్టారు. దీంతో సినిమాకు మొదటి రోజు ఓపెనింగ్స్ బలంగా ఉండనున్నాయి. ఎంతలేదన్నా తెలుగు రాష్ట్రలో ఫస్ట్ డే షేర్ 4 కోట్ల వరకు ఉండవచ్చని ట్రేడ్ వర్గాల ఆంచనా. ఇక రేపు కూడ హాలీడేనే కావడంతో ముందస్తు బుకింగ్స్ కూడ గట్టిగానే ఉన్నాయి. మొత్తానికి రామ్ నుండి లాక్ డౌన్ తర్వాత వచ్చిన మొదటి సినిమా మంచి ఫలితాన్నే ఇచ్చేలా ఉంది.

సంబంధిత సమాచారం :