సీడెడ్ లో ‘లయన్’కి స్ట్రాంగ్ ఓపెనింగ్స్

సీడెడ్ లో ‘లయన్’కి స్ట్రాంగ్ ఓపెనింగ్స్

Published on May 19, 2015 4:30 PM IST

lion-record
‘లెజెండ్’ లాంటి సూపర్ హిట్ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన నందమూరి బాలకృష్ణ ‘లయన్’ సినిమా అభిమానులను మెప్పించింది. మాస్ ఆడియన్స్ ని మెప్పించే అంశాలున్న ఈ సినిమాకి సమ్మర్ సీజన్ కూడా తోడవడంతో బి, సి సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ముఖ్యంగా బాలకృష్ణకి మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ బాగా ఎక్కువగా ఉన్న సీడెడ్ లో స్ట్రాంగ్ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. ఫస్ట్ వీకెండ్ అయిన 4 రోజుల్లో మంచి షేర్ సాధించింది. మొదటి 4 రోజుల్లో సుమారు 2.5 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసిన ఈ సినిమా ఓవరాల్ గా 4 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

అంతే కాకుండా బాలకృష్ణకి మాస్ ఇమేజ్ ఉన్న అన్ని ఏరియాల్లోనూ స్ట్రాంగ్ కలెక్షన్స్ వస్తున్నాయి.మిగిలిన ప్రాంతాల్లో కూడా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. బాలకృష్ణ ఈ సినిమాలో బోసు, గాడ్సే అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించాడు. సత్య దేవ దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటించారు. రుద్రపాటి రమణారావు నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించాడు. ఇదిలా ఉంటే బాలకృష్ణ నటించనున్న తన తదుపరి సినిమా మే 29న మొదలు కానుంది. ఆ సినిమాకి శ్రీ వాస్ దర్శకత్వం వహిస్తాడు.

తాజా వార్తలు