రజనీ గడ్డం వెనుక చాలా కథే ఉందట

Published on Dec 31, 2019 11:26 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం ‘దర్బార్’ జనవరి 9న విడుదలకానుంది. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇందులో రజనీ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆదిత్య అరుణాచలం పాత్రలో కనిపించనున్నారు. అయితే
ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లలో రజనీ పూర్తి గడ్డంతో ఉండటంతో అసలు అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అంత గడ్డంతో ఉంటారా అనే విమర్శలు చేశారు కొందరు.

అయితే దర్శకుడు మురుగదాస్ రజనీ పాత్రకు ఊరికే అలా గడ్డం పెట్టేయలేదట. ఆ గడ్డం వెనుక చాలా కథే ఉందని అంటున్నారు ఆయన. మొదట హీరో పాత్రకి గడ్డం ఉండాలని అనుకున్నప్పుడు మురుగదాస్ అసలు పోలీస్ అధికారికి అంత గడ్డం ఉండొచ్చా లేదా అని చాలామంది సీనియర్ పోలీస్ అధికారుల్ని అడిగారట. వారు కొన్ని వైద్యపరమైన, మతపరమైన కారణాలు ఉంటే స్పెషల్ పర్మిషన్ మీద ఆ పోలీస్ అధికారి గడ్డం ఉంచుకోవచ్చని అన్నారట.

దాంతో మురుగదాస్ రజనీ పాత్రకు గుబురు గడ్డం ఉంచారట. అలాగే ఆ గడ్డం ఉండటానికి ఒక బలమైన కారణం కూడా పెట్టారట. ఆ రీజన్ ఏమిటో సినిమా చూస్తేనే తెలుస్తుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం :

More