స్టార్ హీరోతో గత సినిమాల శైలిలోనే !

స్టార్ హీరోతో గత సినిమాల శైలిలోనే !

Published on Apr 23, 2019 3:57 PM IST

తమిళ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్యతో తన తరువాత సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు డైరెక్టర్ శివ. నిన్న అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలో షూట్ కి సన్నద్ధం అవుతుంది. కాగా ఈ సినిమా కూడా శివ గత సినిమాల శైలిలోనే పక్కా మాస్ అంశాలతో మంచి ఎమోషనల్ గా సాగుతుందట. ముఖ్యంగా సూర్య క్యారెక్టర్ చాలా బాగుంటుందని తెలుస్తోంది.

ఇక గోపీచంద్ తో ‘శౌర్యం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు శివ. ఆ తరువాత తమిళ స్టార్ అజిత్ తో వరుసగా సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు. ఇటీవలే అజిత్ హీరోగా ‘విశ్వాసం’ను తెరకెక్కించాడు. అయితే తెలుగులో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ.. తమిళంలో మాత్రం భారీ విజయాన్ని సాధించింది. దాంతో సూర్య, సినిమా చెయ్యడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు