సైరా యూనిట్ ని సన్మానించిన సుబ్బిరామిరెడ్డి

Published on Oct 10, 2019 7:24 pm IST

ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయవేత్త డా.టి. సుబ్బిరామిరెడ్డి. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్‌ను సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. బుధవారం రాత్రి పార్క్ హయత్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించిన సుబ్బిరామిరెడ్డి.. ‘సైరా’ బృందాన్ని సన్మానించి అభినందించారు.

ఇందుకు మెగాస్టార్, టి సుబ్బిరామిరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. సైరా చిత్రం విజయంపై ఆయన స్పందించిన తీరుకి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సైరా కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే 90కోట్ల షేర్ వసూళ్లు సాధించడం గమనార్హం. చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా చేసిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించగా, సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ మూవీకి సంగీతం అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం :

X
More