అఖిల్ సినిమా కోసం సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ !

అక్కినేని అఖిల్ తన తర్వాతి సినిమాను మొదటి చిత్రం ‘తొలిప్రేమ’ తోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరితో చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం అధికారికంగా లాంచ్ కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టుకున్న ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందించనున్నారు.

‘తొలిప్రేమ’ చిత్రానికి కూడ థమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించి చిత్ర విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ‘తొలిప్రేమ’ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనుండటం విశేషం. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటులు ఎవరనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉం