చరణ్ హిట్ సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది.!

Published on Apr 25, 2021 8:27 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేని హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం “రంగస్థలం”. 2018లో ఒక తెలుగు భాషలోనే విడుదల కాబడిన ఈ చిత్రం అఖండ విజయాన్ని అందుకుంది. చరణ్ కెరీర్ లోనే కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఈ సినిమా అందుకు విజయంతో ఇతర భాషల్లో కూడా డబ్ చేసి వదులుతామని మేకర్స్ తెలియజేసారు. అలా చెప్పినట్టు గానే ఆల్రెడీ కన్నడలో విడుదల చేసి ఇపుడు తమిళ్ లో విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేసే సరికి అక్కడ ఊహించని విధంగా బ్రేక్ పడింది ఈ సినిమాకే.

ఇటీవలే అద్భుతమైన ట్రైలర్ కట్ ను కూడా విడుదల చేసి ఈ ఏప్రిల్ 30న విడుదల కన్ఫర్మ్ చేసారు. కానీ పెరుగుతున్న కరోనా ఉదృతి కారణంగా తమిళనాడు ప్రభుత్వం ఈ వచ్చే 26 అంటే రేపటి నుంచి స్వచ్చందంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా చెప్పారు. దీనితో థియేటర్స్ సహా అంతా మూత పడాల్సి వచ్చింది. సో అలా చరణ్ హిట్ సినిమాకు అక్కడ బ్రేక్ పడాల్సి వచ్చింది. మరి వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :