మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’.ప్రస్తుతం ఈచిత్రం యొక్క షూటింగ్ జార్జియా దేశంలో జరుగుతుంది. ఈ భారీ షెడ్యూల్లో భారీ యుద్ధసన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈషెడ్యూల్ లో ప్రముఖ సీనియర్ నటుడు జగపతి బాబు అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బ్రహ్మజీ తదితరులు పాల్గొంటుండగా తాజాగా కన్నడ స్టార్ హీరో సుధీప్ ఈషూటింగ్లో జాయిన్ అయ్యారు. సుమారు 500 మంది ఈ పోరాట సన్నివేశాలలోపాల్గొంటున్నారు.
సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా తమన్నా ముఖ్య పాత్రలో కనబడనుంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని. భారీ బడ్జెట్తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు .


