ఆ హీరో సినిమా స్క్రిప్ట్ పై పదేళ్లు పనిచేసిన లేడీ డైరెక్టర్

Published on Feb 14, 2020 8:16 am IST

హీరో సూర్య లేటెస్ట్ మూవీ సూరారై పోట్రు, తెలుగులో ఈ చిత్రం ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో విడుదల అవుతుంది.ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి ఆర్ గోపీనాధ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్ సరికొత్తగా సినిమాపై అంచనాలు పెంచింది. టీజర్ లో యాంగ్రీ యంగ్ మెన్ గా సూర్య నటన తార స్థాయిలో ఉంది. కాగా నిన్న వైవిధ్యంగా ఈ చిత్రంలోని ఓ పాటను విడుదల చేశారు. ఓ ప్రత్యేక విమానంలో ఆకాశంలో పాటను విడుదల చేశారు.

కాగా సూరారై పోట్రు సినిమా స్క్రిప్ట్ పై దాదాపు దర్శకురాలు సుధా కొంగర 10 ఏళ్ళు పనిచేశారట. జి ఆర్ గోపినాధ్ కథకు సినిమా హంగులు జోడించి ఒక కమర్షియల్ మూవీగా తీర్చిదిద్దడానికి ఆమె స్క్రిప్ట్ పై అన్నేళ్లు పనిచేశారట. ఇక ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :