రక్షకుడిగా వస్తానంటున్న సుధీర్ బాబు

Published on Jan 21, 2020 4:06 pm IST

నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ వయలెన్స్ బేస్డ్ మూవీగా ఉండనుంది. ఇందులో మరొక హీరో సుధీర్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈయనది ఇందులో పాజిటివ్ క్యారెక్టర్.

తన పాత్ర గురించి చెబుతూ రాక్షసుడు ఎదిగిననాడు ఒకడొస్తాడు, వాడే ఇప్పుడొస్తున్నాడు, రక్షకుడు వస్తున్నాడు అంటూ తన ఫస్ట్ లుక్ జనవరి 27న విడుదలవుతుందని తెలిపారు సుధీర్ బాబు. ఇకపోతే ఈ సినిమాలో నివేత థామస్, అధితిరావ్ హైదరిలు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2020 మార్చి 25న ఉగాది కానుకగా చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More